పుస్తక పఠనం అలవరచుకోవాలి : మహిళా కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ నేరెళ్ల శారద

పుస్తక పఠనం అలవరచుకోవాలి : మహిళా కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ నేరెళ్ల శారద

రామడుగు, వెలుగు: విద్యార్థులు, యువకులు పుస్తక పఠనాన్ని అలవరచుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ నేరెళ్ల శారద అన్నారు. రామడుగు మండలం వెదిర జడ్పీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటుచేసిన లైబ్రరీని కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితాన్ని చక్కగా మలుచుకునేందుకు పుస్తకం ఉపకరిస్తుందని అన్నారు.

రామడుగు మండల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ పుస్తకాలు సమాజం పట్ల అవగాహన, జ్ఞానాన్ని పెంచుతాయని, ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తక పఠనానికి ప్రత్యేక గదులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ పుస్తక పఠనాన్ని ప్రతిఒక్కరూ అలవరచుకోవాలన్నారు.

అనంతరం ఇంటర్​లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన వెదిర గ్రామానికి చెందిన కోరుకొండ పల్లవి, ప్రణీతను సన్మానించారు. అంతకుముందు వెదిరలో లైబ్రరీ ఏర్పాటుకు సహకరించిన కేరళ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ ఆకర్షణను శాలువాతో సత్కరించారు. 9వ తరగతి చదువుతున్న ఆకర్షణ అందరికీ పుస్తకాలు అందాలన్న ఆలోచనతో చిన్న వయసులోనే 22 ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

 కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్​రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తహసీల్దార్ బండి రాజేశ్వరి, ఎంపీడీవో రాజేశ్వరి, ఎంఈవో వేణుకుమార్, హైస్కూల్​ చైర్మన్​ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ తిరుమల, మాజీ ఎంపీపీ జవ్వాజి హరీశ్‌‌‌‌‌‌‌‌​ పాల్గొన్నారు.